
డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం కావడంతో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరిలతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు.