తిరుపతి, శ్రీశైలం.. ఆలయాల్లో ప్రారంభమైన ట్రయల్ రన్స్...

Jun 8, 2020, 4:19 PM IST

అన్ లాక్ లో భాగంగా ఈ రోజునుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుపతి, శ్రీశైలం, సింహాచలం, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ట్రయల్ రన్స్ ఏర్పాటు చేశారు. మొదటి రెండు రోజులు ఆలయసిబ్బంది, స్థానికులకు మాత్రమే ప్రవేశం. ఆలయాల్లో థర్మల్ స్కానింగులు, శానిటైజేషన్, మాస్కులు తప్పనిసరి చేశారు. గంటలు కొట్టడం, శఠగోపం, హారతి, ఆర్చన, అభిషేక సేవలు నిలిపివేశారు. తిరుమలలో ఇంట్రా నెట్ ద్వారా  5400 మంది టిటిడి పర్మినెంట్ ఉద్యోగస్తులు దర్శనాలు బుక్ చేసుకున్నారు. విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే దర్శనం అనుమతించారు. ఎపి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఎపి వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కరోనా రీత్యా‌ పకడ్భందీ జాగ్రత్తా చర్యలు చేపట్టామని తెలిపారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో, మహానందిలోనూ రెండున్నర నెలల లాక్డౌన్ అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి.