
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ విధానాలు దేశానికి దిశానిర్దేశం చేసినవిగా నిలిచాయని లోక్‌సభ సభ్యుడు చంద్ర శేఖర్ పెమ్మసాని పేర్కొన్నారు. వాజ్‌పేయీ నాయకత్వం, ప్రజాస్వామ్య విలువలు, దేశాభివృద్ధిపై చూపిన దృష్టి నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు.