పెట్టుబడుల వికేంద్రీకరణ లక్ష్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువచ్చి సమగ్ర అభివృద్ధి సాధించాలనే దిశగా ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. యువత భవిష్యత్తు కోసం చేపడుతున్న కార్యక్రమాలు త్వరలో మంచి ఫలితాలు ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.