గుంటూరు పట్టణ నడిబొడ్డున గల జిన్నా టవర్ పై గత కొన్నిరోజులుగా నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత పూనుకున్నారు.
గుంటూరు పట్టణ నడిబొడ్డున గల జిన్నా టవర్ పై గత కొన్నిరోజులుగా నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత పూనుకున్నారు. ఇప్పటికే జిన్నా టవర్ కు త్రివర్ణ పతాకంలోని మూడు రంగులు వేసి ఆ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాదు రక్షణ చర్యలు చేపట్టారు. ఇక ఇటీవల రిపబ్లిక్ డే రోజులు ఈ టవర్ వద్ద జాతీయ జెండా ఎగరవేయడానికి హిందూవాహిని కార్యకర్తలు ప్రయత్నించగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఇవాళ స్వయంగా హోంమంత్రి మేకతోటి సుచరిత జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి వివాదానికి తెరదించే ప్రయత్నం చేసారు.