మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరం ప్రారంభించి, రక్తదాతలను అభినందించారు.