
ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశంసలు కురిపించారు. గ్రామీణ వ్యవస్థను మెరుగు పరుస్తూ గ్రామాల్లో మెరుగైన రోడ్డు, తాగు నీటి సౌకర్యం, మెరుగైన ఆరోగ్యం, ఇతర మౌలిక వసతులు అందిస్తున్నారన్నారు. ఈ ప్రయాణంలో తామంతా వెంట నడుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 77 డీడీఓ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఆనం మాట్లాడారు.