వచ్చే పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో వైసీపీ నాయకుల్లో భయాందోళన మొదలైందని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. వ్యవస్థాపూర్వకమైన చర్చలు జరపండని పవన్ కళ్యాణ్ చెప్తుంటే వైసీపీ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు. నాయకుడిగా పనికి రావాలంటే జగన్ మోహన్ రెడ్డిలా కేసులు ఉండాలా అని ప్రశ్నించారు.