Galam Venkata Rao | Published: Feb 14, 2025, 2:01 PM IST
రెడ్ బుక్ పాలన చూసి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ మొహం చూడ్డానికే ఇష్టపడటం లేదని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ వైస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గుడ్ బుక్ ప్రకారం చంద్రబాబు అరాచకాలకు తగిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు.