Sep 28, 2021, 10:54 AM IST
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను తీరందాటిన ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లాలో కూడా గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. విశాఖ నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లపైకే కాదు విమానాశ్రయంలోకి కూడా వరదనీరు చేరింది. రన్ వే పైకి కూడా నీరు చేరడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.