Jan 4, 2020, 4:38 PM IST
రాజధానుల మార్పు నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రాజధానిపై ప్రభుత్వ అస్పష్ట ప్రకటనలు, ఇక రాజధాని అమరావతిలో ఉండదన్న విషయం స్పష్టం కావడంతో మనస్తాపం చెందిన దొండపాడుకు చెందిన రైతు కొమ్మినేని మల్లిఖార్జునరావు మృతి చెందాడు. ఆయనకు తుళ్లూరులో ధర్నా చేస్తున్న రైతులు మౌనం పాటించి సంతాపం తెలిపారు.