Apr 22, 2021, 2:57 PM IST
న్యూడిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సిబిఐ కోర్టులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును 27వ తేదీకి రిజర్వ్ చేసింది. ఈ విషయాన్ని ఎంపీ రఘురామ తెలియజేస్తూ బెయిల్ రద్దుపై తమ లాయర్లు ఆశాభావంతో వున్నారన్నారు. సిబిఐ కోర్టులో ఎందుకు జగన్ కు బెయిల్ రద్దు చేయాలన్నదానిపై అడ్వోకేట్ ఆదినారాయణ రావు వాదనను బలంగా వినిపించారని తెలిపారు. న్యాయం జరుగాలని అందరూ కోరుకోవాలని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.