
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు కీలకంగా పని చేస్తాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ విభాగంలో ప్రమోషన్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారని, వారికి ప్రమోషన్లతో పాటు అదనపు బాధ్యతలు కూడా ఇచ్చినందుకు తద్వారా ప్రజలకు అతి దగ్గరగా సేవలందించే అవకాశం కల్పించినందుకు ఉపముఖ్యమంత్రి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు.