వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ (వీడియో)

Sep 30, 2019, 8:44 PM IST

కలియుగ దైవం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. తలపై స్వామివారి శేష వస్త్రంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్లారు సీఎం జగన్. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన సీఎం గర్భాలయంలో మూలవిరాట్టు ముందు అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేశారు.