Capital Crisis : 11వ రోజుకు చేరిన రాజధాని మహాధర్నా

Dec 28, 2019, 12:51 PM IST

రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ జరుగుతున్న నిరసన దీక్షలు 11వ రోజుకి చేరుకున్నాయి. నిన్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ తర్వాత రాజధాని విషయంపై స్పష్టత వస్తుందని రాజధాని ప్రాంత రైతులు ఎదురు చూశారు. కానీ క్యాబినేట్ భేటీలో జరిగిన చర్చల్లో రాజధానికి అనుకూల ప్రకటనలు రాకపోవటంతో రాజధాని రైతులు తమ నిరసనలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయాన్నే తుళ్ళూరు, మందడం గ్రామాల్లో రోడ్లపై ధర్నా ప్రారంభించారు. తుళ్ళూరు, తాడికొండ మండలాల్లోని అడ్డరోడ్డు సెంటర్లో వంటావార్పు కార్యక్రమాలు చేస్తున్నారు. కృష్ణ జిల్లా తెలుగు యువత ప్రెసిడెంట్ చందు మందడం గ్రామ రైతులకు సంగీభావంగా ధర్నాలో పాల్గొన్నారు.