వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

Published : Sep 26, 2019, 07:38 AM ISTUpdated : Sep 26, 2019, 07:39 AM IST
వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

సారాంశం

తిరుపతిలోని అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

తిరుపతి: తిరుపతి అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ త‌రువాత‌ యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. 

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె,  కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు జ‌రిగాయి.ఈ కార్యక్రమంలో ఆల‌య సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, అర్చకులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

వెంకన్న భక్తులకు శుభవార్త.. తిరుపతికి ప్రత్యేక రైలు
లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో