మాజీ ఎంపీ శివప్రసాద్ కు తీవ్ర అస్వస్థత

By narsimha lodeFirst Published Sep 12, 2019, 1:12 PM IST
Highlights

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.


తిరుపతి: చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం చెన్నైకు తరలించారు. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

బుధవారం నాడు రాత్రి  చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తరలించారు.

కొంతకాలంగా శివప్రసాద్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. బుదవారం నాడు వెన్ను నొప్పి ఎక్కువ కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు శివప్రసాద్ కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు సూచించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో పాటు పలు సమకాలీన అంశాలపై పార్లమెంట్ ఎదుట వినూత్న రీతిలో వేషాలు వేసి తన నిరసనను తెలిపేవాడు శివప్రసాద్. ప్రత్యేక హోదా విషయంలో ఎంపీ శివప్రసాద్ చేసిన వినూత్న నిరసనలపై పార్లమెంట్ లోనే మోడీ ప్రస్తావించారు.

చంద్రబాబునాయుడు, మాజీ ఎంపీ శివప్రసాద్  క్లాస్‌మేట్స్. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో వీరిద్దరూ కలిసి చదువుకొన్నారు.తిరుపతి నుండి ఆయన పలు దఫాలు ఎంపీగా విజయం సాధించారు. గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా కూడ పనిచేశారు. 
 

click me!