హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ ఘటన అనంతరం రైతులు ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా రామకుప్పం ఎమ్మార్వో కార్యాలయంలోనే కొందరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం ఎమ్మార్వో కార్యాలయంలో ఐదుమంది రైతులు కుటుంబాలు ఆందోళనకు దిగారు. 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములపై ఇతరులకు పాస్ బుక్ లు ఇవ్వడంతో చేసేది లేక ఎమ్మార్వో కార్యాలయంలోనే ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కార్యాలయం గేట్లకు ఉరి వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరక్కుంటే కార్యాలయంలో ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
తగరలు తాండాకు చెందిన రైతులు బాబూనాయక్, లీల, శేఖర్ నాయక్, సుజాత, సరోజమ్మలు తమ భూములకు చెందిన పాసు పుస్తకాల కోసం గతకొంతకాలంగా తిరుగుతున్నామన్నారు. తాము 35 ఏళ్లుగా సాగుచేస్తున్న భూమికి వేరే వారి పేరుతో ఇ పాస్ బుక్ లు మంజూరు చేసినట్లు వారు తెలిపారు. దీంతో తమ సమస్యను పరిష్కరించకపోగా ఇతరులకు పాస్ బుక్ మంజూరు చేయడంతో కబ్జాదారులు భూముల్లోకి వచ్చారన్నారు.
undefined
దీంతో భూములు అనుభవిస్తున్న వారందరూ తహసీల్దారు ను నిలదీశారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆఫీసులోనే తమ వెంట తెచ్చుకున్న తాళ్ళతో ఉరివేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో జిల్లాలో కలకలం రేగింది.
read more pattikonda mro: విజయారెడ్డి హత్య ఎఫెక్ట్: ఆంధ్ర ఎమ్మార్వోల ముందు జాగ్రత్త
ఈ నెల 4వ తేదీన అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయా రెడ్డిని సురేష్ అనే వ్యక్తి సజీవ దహనం చేశారు. సజీవ దహనం కేసుకు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ రంగు పులుముకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య విమర్శలు చేసుకంటున్నారు. అలాగే ఎమ్మార్వో కార్యాలయాల్లో పనుల కోసం తిరుగుతున్న ఆందోళనలు, కార్యాలయ సిబ్బంది జాగ్రత్తలు కూడా ఎక్కువయ్యాయి.
ఇలా కర్నూల్ జిల్లాకు చెందిన రెవిన్యూ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. కర్నూల్ జిల్లా పత్తికొండ కు చెందిన తహసీల్దార్ ఉమా మహేశ్వరీ తన చాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించారు. ఈ తాడు బయట నుండే ఆర్జీలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ తాడు దాటి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు.
తమ జాగ్రత్తలు తామే తీసుకోవాలి కదా...అందుకే తన చాంబర్‌లో ఇలా తాడు కట్టించినట్టుగా ఎమ్మార్వో ఉమా మహేశ్వరి చెప్పారు. తన చాంబర్లో తాడు లోపలికి ఎమ్మార్వో ఎవరిని అనుమతించడం లేదు.
read more Tahsildar Vijaya: ప్రత్యేక అధికారి నియామకం.. విజయారెడ్డి హత్య ముందు సురేష్..
ఎమ్మార్వో విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి భూ వివాదం కేసులో హత్య చేశాడు. ప్రస్తుతం సురేష్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సురేష్ కోలుకొన్న తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.