French Open 2020: రఫెల్ ‘బుల్’ రికార్డు విక్టరీ... జోకోవిచ్‌కి షాక్ ఇచ్చిన నాదల్...

Published : Oct 11, 2020, 09:50 PM IST
French Open 2020: రఫెల్ ‘బుల్’ రికార్డు విక్టరీ... జోకోవిచ్‌కి షాక్ ఇచ్చిన నాదల్...

సారాంశం

కెరీర్‌లో 13వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన రఫెల్ నాదల్... కెరీర్‌లో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో ఫెదరర్ రికార్డు సమం... ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో కనీస పోరాటం చూపించలేకపోయిన నోవాక్ జోకోవిచ్...

స్పానిష్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ఖాతాలో మరో ఫ్రెంచ్ ఓపెన్ చేరింది. మట్టి కోర్టులో చెలరేగిపోయే రఫెల్ నాదల్ జోరు ముందు సెర్భియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ నిలవలేకపోయాడు. కెరీర్‌లో 20వ గ్రాండ్ స్లామ్ గెలిచిన రఫెల్ నాదల్‌కి, ఇది 13వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. కెరీర్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన టెన్నిస్ ప్లేయర్‌గా రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు రఫెల్ నాదల్. 

నోవాక్ జొకోవిచ్‌కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా 0-6 తేడాతో మొదటి సెట్ గెలుచుకున్న రఫెల్ నాదల్, 6-2, 5-7 తేడాతో వరుసగా మూడు సెట్లు గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ 2020 టైటిల్ కైవసం చేసుకున్నాడు. 2005 నుంచి వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ గెలుస్తూ వస్తున్న రఫెల్ నాదల్, ఒక్క 2015, 2016 సంవత్సరాల్లో మాత్రమే టైటిల్ గెలవలేకపోయాడు. 

PREV
click me!

Recommended Stories

Wimbledon White Dress Code: వింబుల్డన్‌లో వైట్ డ్రెస్సే ఎందుకు? టెన్నిస్ ప్లేయర్స్ 150 ఏళ్లుగా ఫాలో అవుతున్న వింత రూల్ !
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?