హైకోర్టు అనుమతి:ఈ నెల 4నుండి వైఎస్ షర్మిల పాదయాత్ర పున: ప్రారంభం

By narsimha lodeFirst Published Dec 2, 2022, 3:41 PM IST
Highlights

వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర ఈ నెల 4వ తేదీ నుండి  పున: ప్రారంభం కానుంది.  షర్మిల పాదయాత్రకు  తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్  షర్మిల  ప్రజా ప్రస్థాన పాదయాత్రను ఈ  నెల 4వ తేదీన పున: ప్రారంభించనున్నారు.  వైఎస్ షర్మిల పాదయాత్రకు  హైకోర్టు అనుమతిని  ఇచ్చింది.  ఈ విషయమై వైఎస్ఆర్‌టీపీ నేత  రవీంద్రనాథ్ రెడ్డి  దాఖలు చేసిన పిటిషన్ పై  హైకోర్టు అనుమతిని ఇచ్చింది. దీంతో  పాదయాత్రను పున: ప్రారంభించాలని  షర్మిల భావిస్తున్నారు.

నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడ పాదయాత్రను నిలిపివేశారో  అదే ప్రాంతం  నుండి  పాదయాత్రను కొనసాగించనున్నారు. ఈ నెల 4వ తేదీ నుండి  14వ తేదీ వరకు  పాదయాత్ర కొనసాగనుంది.  14వ తేదీతో  పాదయాత్ర  ముగియనుంది. పాదయాత్ర  ముగింపును పురస్కరించుకొని  ఉమ్మడి  వరంగల్  జిల్లాలో  బహిరంగ  సభను ఏర్పాటు చేయాలని కూడ వైఎస్ఆర్‌టీపీ  భావిస్తుంది. ఈ  నెల 28వ తేదీన నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో లింగగిరి వద్ద  వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్  చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో  ఉద్రిక్త  పరిస్థితులు చోటు  చేసుకున్న నేపథ్యంలో  షర్మిలను పోలీసులు  అరెస్ట్  చేశారు.ఈ నెల 27న  షర్మిల పాదయాత్ర  3500 కిలోమీటర్లకు చేరుకుంది.  ఈ సందర్బంగా నిర్వహించిన సభలో  స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్వన్  రెడ్డి పై షర్మిల వ్యక్తిగత విమర్శలు చేశారు.  ఈ విమర్శలకు గాను క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్  నేతలు డిమాండ్  చేశారు. కానీ  షర్మిల  మాత్రం తన పాదయాత్రను కొనసాగించారు.దీంతో  ఈ నెల 28న షర్మిల  బస చేసే బస్సును టీఆర్ఎస్  శ్రేణులు  నిప్పంటించాయి.   వైఎస్ఆర్‌టీపీ వాహనాలను ధ్వంసం చేశాయి. దీంతో ఉద్రిక్తత  చోటు  చేసుకుంది.ఈ  పరిణామాల నేపథ్యంలో  షర్మిలను  పోలీసులు అరెస్ట్  చేసి  లింగగిరి నుండి లోటస్ పాండ్ కు తరలించారు.

also read:పెద్ది సదర్శన్ రెడ్డి మగతనంతో నాకేం పని.. కేటీఆర్ భార్య ఆంధ్రాకు చెందినవారు కాదా?: వైఎస్ షర్మిల

ఈ  నెల 29న  లోటస్  పాండ్  నుండి  ప్రగతి భవన్  వద్ద ధర్నాకు వెళ్లేందుకు  ప్రయత్నించిన షర్మిలను  పోలీసులు సంజాగుట్ట వద్ద  అడ్డుకున్నారు. ఆమెను  అరెస్ట్  చేసి  ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. కారులో  ఉండగానే క్రేన్ సహాయంతో  షర్మిలను  పోలీసులు ఎస్ఆర్ నగర్  పోలీస్ స్టేషన్ కు తరలించారు..ఈ ఘటనను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.  ఈ  ఘటనపై గవర్నర్  తమిళిపై సౌందర రాజన్ కూడా  స్పందించారు. ఈ పరిణామాలపై  తమిళిసైని కలిసి షర్మిల నిన్న వినతి పత్రం  సమర్పించారు. 

click me!