వైఎస్ఆర్ భార్యను అవమానించినందుకు అనుభవిస్తావు: కేసీఆర్ పై షర్మిల

By narsimha lodeFirst Published Apr 25, 2023, 5:30 PM IST
Highlights

తనను అరెస్ట్  చేయడంపై  కేసీఆర్ సర్కార్ పై  వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.   కేసీఆర్  పాలనను తాలిబన్ పాలనగా   ఆమె పేర్కొన్నారు. 
 


హైదరాబాద్:  వైఎస్ రాజశేఖర్ రెడ్డి  భార్యను  కేసీఆర్ అవమానించారని వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల ఆరోపించారు.  రాజశేఖర్ రెడ్డి బిడ్డనైనా తనను  జైల్లో పెట్టారన్నారు.  ఇందుకు  కేసీఆర్ ఇంతకు ఇంత అనుభవిస్తారని  వైఎస్ షర్మిల  హెచ్చరించారు. 

చంచల్ గూడ జైలు నుండి మంగళవారంనాడు సాయంత్రం ఆమె విడుదలయ్యారు. ఈ  సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.  రాజశేఖర్ రెడ్డి బిడ్డ  మీ తాటాకు చప్పుళ్లకు  భయపడదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా  తాను  తగ్గేది లేదన్నారు.  తాను సెల్ఫ్ డిఫెన్స్   చేసుకొనే  ప్రక్రియలోనే పోలీసులపై దాడి  చేసినట్టుగా షర్మిల వివరించారు.

పోలీసులను  కేసీఆర్ కుక్కల్లా వాడుకున్నారని  షర్మిల  తీవ్ర పదజాలం ఉపయోగించారు.  తాను ఏం చేశానని  కేసీఆర్  జైలుకు  పంపారని  షర్మిల  ప్రశ్నించారు. కేసీఆర్ పాలన తాలిబన్లను తలపించేలా ఉందన్నారు.   తనను అడ్డుకొని   బెదిరించే  ప్రయత్నం చేశారని ఆమె  పోలీసులపై మండిపడ్డారు.ఈ వీడియోలను ఎందుకు బయటపెట్టలేదని  ఆమె  పోలీసులను  ప్రశ్నించారు.  పోలీసలుు ఉద్దేశ్యపూర్వకంగా  సెలెక్ట్ వీడియోలను బయటపెట్టారని వైఎస్ షర్మిల  ఆరోపించారు.మగపోలీసులు తనను బెదిరించే  వీడియోలు ఎందుకు బయటపెట్టలేదో  చెప్పాలన్నారు. 

 తనను ఉద్దేశ్యపూర్వకంగా  అరెస్ట్  చేశారన్నారు.   మహిళా అని చూడకుండా  తనపై  మగ  పోలీసులతో దాడి  చేయించారన్నారు.   వైఎస్ విజయమ్మ  నిన్న  పోలీసుపై చిన్న దెబ్బ వేశారన్నారు. దానికే పెద్ద బాంబు వేసినట్టుగా  చిత్రీకరించారని  షర్మిల  విమర్శించారు.    

also read:వైఎస్ షర్మిలకు బెయిల్: చంచల్ గూడ జైలు నుండి విడుదల

తాను  సిట్  కార్యాలయానికి వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం  చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారని  వైఎస్ షర్మిల  చెప్పారు.   కేసీఆర్ కు అసలు  పాలన  చేతనౌతుందా అని ఆమె ప్రశ్నించారు.  కేసీఆర్ కు అవినీతి మాత్రమే చేతనైందని ఆమె ఆరోపించారు.  రియల్ ఏస్టేట్   చేయడం కేటీఆర్ కు,   లిక్కర్ స్కామ్ కు పాల్పడడం  కవితకు  చేతనైందని  షర్మిల  విమర్శించారు.   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ .ఇంటికో ఉద్యోగం  హామీ గురించి కేసీఆర్ ఏం చెబుతారని  షర్మిల ప్రశ్నించారు.  

గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఢిల్లీలో  ఏపీ భవన్   ఉద్యోగిపై  హరీష్ రావు దాడిని  , పోలీసులపై  కేటీఆర్  దూషించే వీడియోలను ఆమె మీడియా సమావేశంలో  చూపారు.  ఇలా వ్యవహరించిన  ఈ ఇద్దరిపై  ఎలాంటి చర్యలు తీసుకోలేదని  షర్మిల  గుర్తు  చేశారు.  

click me!