పోలీసుల కళ్లుగప్పి లోటస్ పాండ్‌ నుండి బయటకు వెళ్లిన వైఎస్ షర్మిల

By narsimha lodeFirst Published Nov 29, 2022, 12:23 PM IST
Highlights

 లోటస్ పాండ్  నుండి  పోలీసుల కళ్లుగప్పి వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్  షర్మిల  బయటకు వెళ్లారు.  నిన్న నర్సంపేటలో  అరెస్ట్  చేసిన  తర్వాత ఆమెను హైద్రాబాద్ కు తరలించారు

హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల  మంగళవారంనాడు  ఉదయం పోలీసుల కళ్లుుగప్పి  హైద్రాబాద్  లోటస్ పాండ్ ను  బయటకు వెళ్లిపోయారు. లోటస్  పాండ్ నుండి  ప్రగతి  భవన్ వైపునకు వెళ్లినట్టుగా  భావిస్తున్నారు. నర్సంపేటలో  నిన్న మధ్యాహ్నం వైఎస్  షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేట నుండి  షర్మిలను హైద్రాబాద్ కు తీసుకువచ్చారు. రేపు మహబూబాబాద్ లో  షర్మిల టూర్  యధావిధిగా  జరగనుంది.  అయితే  ఈ తరుణంలో  ఇవాళ  మధ్యాహ్నం  లోటస్ పాండ్  నుండి షర్మిల  పోలీసుల కళ్లుగప్పి  ఇంటి  నుండి  బయటకు వెళ్లారు.  షర్మిల  ప్రగతి  భవన్  వైపునకు వెళ్లిందనే  ప్రచారం సాగుతుంది.  

also read:రేపు మహబూబాబాద్‌లో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల టూర్

ప్రజా ప్రస్థానం  పేరుతో  వైఎస్ షర్మిల  పాదయాత్ర చేస్తున్నారు. షర్మిల  పాదయాత్ర  ఈ  నెల 27వ తేదీ నాటికి  3500 కి.మీ చేరుకుంది.  దీంతో  పైలాన్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా  వైఎస్ఆర్‌టీపీ ఆధ్వర్యంలో సభను  నిర్వహించారు.ఈ సభలో  వైఎస్  విజయమ్మ కూడా  పాల్గొన్నారు.నర్సంపేట  ఎమ్మెల్యే  పెద్ది  సుదర్శన్  రెడ్డిపై షర్మిల  తీవ్ర విమర్శలు  చేశారు.ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి  అవినీతిపరుడంటూ ఆమె వ్యాఖ్యానించారు. సుదర్శన్ రెడ్డిపై  చేసిన విమర్శలపై  క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్  డిమాండ్  చేసింది. క్షమాపణలు చెప్పకుండా పాదయాత్ర  చేస్తున్న  వైఎస్  షర్మిల పాదయాత్రకు టీఆర్ఎస్  శ్రేణులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. నిన్న  లింగగిరి వద్ద  షర్మిల  బస చేసే బస్సుకు టీఆర్ఎస్  శ్రేణులు నిప్పంటించారు. వైఎస్ఆర్‌టీపీ  శ్రేణులు  ఈ  మంటలను ఆర్పాయి.  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో  పోలీసులు షర్మిలను  అరెస్ట్  చేశారు.
 

click me!