మరదలంటే తప్పు లేదు.. నేను ‘ఎవడ్రా’ అంటే తప్పొచ్చిందా : నిరంజన్ రెడ్డిపై షర్మిల ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 14, 2022, 8:30 PM IST
Highlights

మంత్రి నిరంజన్ రెడ్డి- వైఎస్ షర్మిల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపుతోన్న సంగతి తెలిసిందే. తననై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టకముందే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భయం మొదలైందన్నారు వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల. ఎమ్మెల్యేల అవినీతిపై ప్రశ్నిస్తే స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని విమర్శించారు. మంత్రి నిరంజన్ రెడ్డి మరదలు అంటే తప్పు లేదు గానీ, ఎవడ్రా నీకు మరదలినంటే తప్పొచ్చిందా అని షర్మిల ప్రశ్నించారు. పరాయి స్త్రీని మరదలని పిలిస్తే మీరేం చేస్తారని షర్మిల ప్రజలను అడిగారు. వీధి కుక్క అంటారా..? చెప్పుతో కొడతారా అని ఆమె ప్రశ్నించారు. 

అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి  తనపై చర్యలు తీసుకొంటే న్యాయపరంగా ముందుకు వెళ్తానని వైఎస్ షర్మిల చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర శిబిరం వద్ద ఆమె తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. 

ALso REad:స్పీకర్ చర్యలు తీసుకొంటే న్యాయపరంగా వెళ్తాం: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల

ప్రజలు చర్చించుకుంటున్న అంశాలతో పాటు జర్నలిస్టుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా తాను పాదయాత్ర సందర్భంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులపై విమర్శలు చేసినట్టుగా షర్మిల వివరించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తన పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులపై తాను చేసిన విమర్శల్లో అవాస్తవాలు లేవన్నారు. ప్రజలు చర్చించుకుంటున్న అంశాలనే తాను ప్రస్తావించానన్నారు. ప్రజలు చర్చించుకుంటున్నఅంశాలకు ఆధారాలు ఉండవని షర్మిల పేర్కొన్నారు. 

రాష్ట్రంలో చోటు చేసుకున్న విషయాలపై మాట్లాడేందుకు ప్రజలు భయపడుతున్నారన్నారు. ప్రజలే కాదు జర్నలిస్టులు కూడా ఈ విషయమై మాట్లాడేందుకు జంకుతున్నారని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగాలు తీయించి వేస్తారని, కేసులు పెడతారనే భయం ఉందన్నారు. అధికార పార్టీ చేస్తున్న అవినీతి గురించి బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని షర్మిల ప్రశ్నించారు. అధికార పార్టీ అవినీతిని ప్రశ్నించేసరికి కోపం వస్తుందా అని టీఆర్ఎస్ నేతలపై చురకలు వేశారు. నిజాలు మాట్లాడడం తప్పా.. టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం సరైందేనా అని ఆమె ప్రశ్నించారు. 

click me!