నాది ఆంధ్ర అయితే సోనియాది ఎక్కడ?: రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల కౌంటర్

By narsimha lodeFirst Published May 24, 2023, 2:14 PM IST
Highlights


తనపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చేసిన  ఆరోపణలపై  వైఎస్ఆర్‌టీపీ చీఫ్  వైఎస్ షర్మిల కౌంటర్  ఇచ్చారు.  తాను  తెలంగాణలో  రాజకీయాలు  చేస్తే  రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. 

హైదరాబాద్: తనది  ఆంధ్ర  అయితే  మరి సోనియా గాంధీది ఎక్కడని  వైఎస్ఆర్‌టీపీ  చీఫ్  వైఎస్ షర్మిల  ప్రశ్నించారువైఎస్ షర్మిలది ఆంధ్రా ప్రాంతమని  ఇటీవల  రేవంత్ రెడ్డి  విమర్శించారు. తెలంగాణను తెచ్చుకుంది  తెలంగాణ నేతలు  పరిపాలించుకోవడం కోసమేనన్నారు.   ఈ వ్యాఖ్యలపై   వైఎస్ షర్మిల   కౌంటర్ ఇచ్చారు.   బుధవారంనాడు  హైద్రాబాద్ లో  వైఎస్ షర్మిల  మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీది  ఇటలీ కదా అని ఆమె అడిగారు.  

ఒక ప్రాంతం వదిలి, సొంత వాళ్ళకు పెళ్లితో మహిళ దూరం అవుతుందన్నారు.  అంతేకాదు  బిడ్డలను  కని  తనను తానే అంకితం  చేసుకుంటుందని  షర్మిల  వివరించారు.  ఇది మన దేశ సంస్కృతి ,గొప్పదనంగా ఆమె  పేర్కొన్నారు.  ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవడానికి   సంస్కారం ఉండాలన్నారు.  ఇంతటి సంస్కారం రేవంత్ రెడ్డికి లేదని షర్మిల   విమర్శించారు.

తనకు   చీర, సారే పెడతాడట....కానీ ఇక్కడ రాజకీయాలు చేయొద్దని  రేవంత్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలపై  ఆమె మండిపడ్డారు. ఇదే తీరులో  సోనియా గాంధీకి  రేవంత్ రెడ్డికి చీర, సారే పెడతాం ..రాజకీయాలు చేయొద్దు అని చెప్పే దమ్ముందా అని  ప్రశ్నించారు.   తాను  తెలంగాణలో  రాజకీయాలు  చేస్తుంటే    రేవంత్ రెడ్డి  అభద్రతా భావంతో  ఉన్నారని  ఆమె  తెలిపారు.  తన కారణంగా  ఉనికిని  కోల్పోయే  ప్రమాదం  ఉందని  రేవంత్ రెడ్డి  భయపడుతున్నారని షర్మిల   చెప్పారు.   రేవంత్ రెడ్డి మాటలను  చూస్తే ఇదే  అర్ధమౌతుందన్నారు.

తెలంగాణ లో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ  వైఎస్‌ఆర్‌టీపయేనన్నారు.  తెలంగాణ అనే పదం ఉన్న పార్టీ వైఎస్ఆర్‌టీపీయేనన్నారు.. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ  తమదేనన్నారు.  జై తెలంగాణ అనే  దమ్ము  రేవంత్ రెడ్డికి,కేసీఅర్ కి,మోడీకి ,సోనియా కు  లేదన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రానేనని ఆమె గుర్తు  చేశారు. ముందు ఆ సంగతి ఏంటో చూసుకోవాలని రేవంత్ రెడ్డికి ఆమె సూచించారు.
 

click me!