వైఎస్సార్ తెలంగాణ పార్టీ విధి విధానాలు.. ఆ మూడింటికే తొలి ప్రాధాన్యం: వైఎస్ షర్మిల

By Siva KodatiFirst Published Jul 8, 2021, 6:17 PM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ పార్టీ విధి విధానాలను వైఎస్ షర్మిల ప్రకటించారు. సంక్షేమం, స్వయం సంవృద్ధి, సమానత్వం ఈ మూడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోని మూడు ముఖ్యమైన అంశాలన్నారు.

వైఎస్ కోట్ల మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు వైఎస్ షర్మిల. హైదరాబాద్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో ఆమె మాట్లాడారు. నాన్న మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్లేనని అన్నారు. శత్రువులు  సైతం ప్రశంసించిన నేత మన వైఎస్సార్ అంటూ గుర్తుచేసుకున్నారు. ఆయన చూపిన బాటలో నడవటానికి ఆయన పుట్టినరోజు నాడే ‘‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’’ని స్థాపిస్తున్నామన్నారు.

వైఎస్ఆర్  నాయకత్వాన్ని మళ్లీ నిలబెట్టడానికి.. వైఎస్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడానికి ఈరోజున ‘‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’’ని స్థాపిస్తున్నట్లు షర్మిల తెలిపారు. ఈ  సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ విధి విధానాలను ఆమె తెలిపారు. సంక్షేమం, స్వయం సంవృద్ధి, సమానత్వం ఈ మూడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోని మూడు ముఖ్యమైన అంశాలన్నారు. ఇందులో సంక్షేమం విషయానికి వస్తే.. ప్రజలకు ఆత్మనిర్భరం దేని ద్వారా కలిగించగలమో అదే సంక్షేమమన్నారు.

తమను తాము అభివృద్ధి పరచుకునేలాగా అవకాశాలు కల్పించడమే వైఎస్సార్ సంక్షేమమన్నారు. వైఎస్ వేసిన  సంక్షేమ బాట ఈరోజుకి ఓ రోల్ మోడల్ అన్నారు. రైతులు చల్లగా వుండాలని రుణ మాఫీ చేశారని.. ఉచిత విద్యుత్, పావలా వడ్డీకే రుణాలు ఏది వీలైతే అది అమలు చేశారని షర్మిల గుర్తుచేశారు. 

click me!