సీఎం కేసీఆర్ ఇలాకాలో నిరుద్యోగి ఆత్మహత్య... వైఎస్ షర్మిల నిరాహార దీక్ష

By Arun Kumar PFirst Published Aug 31, 2021, 1:31 PM IST
Highlights

తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల ఇవాళ ఏకంగా సీఎం కేసీఆర్ ఇలాకా గజ్వేల్ లోనే దీక్షకు దిగారు.

గజ్వేల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ''నిరుద్యోగ నిరాహార దీక్ష'' చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని  అనంతరావుపల్లి గ్రామానికి చేరుకున్న షర్మిల మొదట ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొప్పు రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. చేతికి అందివచ్చిన కొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న తల్లిదండ్రులను ఓదార్చారు. 

అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన దీక్షాస్థలికి చేరుకున్నారు షర్మిల. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించి నిరాదీక్షకు కూర్చుకున్నారు. ఇవాళ సాయంత్రం వరకు షర్మిల నిరాహార దీక్ష కొనసాగనుంది. దీక్షను విరమించిన అనంతరం షర్మిత నిరుద్యోగ సమస్యపై ప్రసంగించనున్నారు.  

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై షర్మిల పోరాటం సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గానికి చేరింది. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లోనూ నిరుద్యోగుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడంపై షర్మిల ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.  

read more  వైఎస్ఆర్ సంస్మరణ సభకు విజయమ్మ ఆహ్వానం: ఏపీ, తెలంగాణ నేతల తర్జన భర్జన

అనంతరావులపల్లిలో  వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షకు వైఎస్ అభిమానులు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద సంఖ్య‌లో హాజరయ్యారు.  

తెలంగాణలో పార్టీ స్థాపించిన షర్మిల నిరుద్యోగ సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగులకు కేటాయించిన షర్మిల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల, సిరిసిల్ల, హుజురాబాద్ లో నిరాహార దీక్ష చేపట్టిన షర్మిల తాజాగా సీఎం జగన్ ఇలాకాలో దీక్ష చేపట్టారు.
 

click me!