Huzurabad : మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కోపం వచ్చింది.. చేతిలోని ఫోన్ విసిరికొట్టి..

Published : Aug 31, 2021, 01:29 PM IST
Huzurabad : మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కోపం వచ్చింది.. చేతిలోని ఫోన్ విసిరికొట్టి..

సారాంశం

అధికారులు ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో అంసతృప్లి వ్యక్తం చేశారు. కాగా, ఏర్పాట్లు సరిగా చేయలేదని ఒకవైపు కొప్పుల నిలదీస్తుండగానే ఆ అధికారి మంత్రి మాటలను పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతుండడంతో కొప్పుల మరింత సీరియస్ అయ్యారు. చేతిలో సెల్ ఫోన్ ను విసిరి సమావేశం నుంచి వెళ్లిపోయారు.

హజూరాబాద్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 21వ వార్డులో సోమవారం దళితబంధు సర్వే పర్యవేక్షణకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ అధికారి తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రుల కన్నా మరే బిజీగా ఉంటున్నారా? మంత్రి రాకపై ముందే సమాచారం ఇచ్చినా.. కనీస ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారా’ అని అసహనం వ్యక్తం చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చి, దళిత బంధు గురించి మాట్లాడడానికి వస్తున్నానని తెలిసినా.. పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. 

 

అంతేకాదు అధికారులు ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో అంసతృప్లి వ్యక్తం చేశారు. కాగా, ఏర్పాట్లు సరిగా చేయలేదని ఒకవైపు కొప్పుల నిలదీస్తుండగానే ఆ అధికారి మంత్రి మాటలను పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతుండడంతో కొప్పుల మరింత సీరియస్ అయ్యారు. చేతిలో సెల్ ఫోన్ ను విసిరి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంత్రి కొప్పుల ఒక్కసారిగా అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతిలోని ఫోన్ విసిరివేయడం చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్