ములుగు, మహబూబాబాద్ ఏజెన్సీ లో పెద్ద పులి సంచారం.. హాని తలపెట్టొదన్న అటవీశాఖ..

By AN TeluguFirst Published Aug 31, 2021, 12:25 PM IST
Highlights

పెద్దపులి రాకను అడవికి రక్షణ గా భావిస్తున్నామని అటవిశాఖ తెలిపింది. ములుగు జిల్లా జగ్గన్నగూడెం నుండీ మహబూబబాద్ జిల్లా కొత్తగూడ అడవులలోకీ పెద్దపులి ప్రవేశించింది. కొత్తగూడ మండలం ఓటాయి శివారు అడవి ప్రాంతంలో గ్రామస్తులు గుర్తించిన పాద ముద్ర లు పెద్ద పులివే అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.

వరంగల్ : మూలుగు, మహబూబాబాద్ ఏజెన్సీ లో పెద్ద పులి సంచారం ఆనవాళ్లు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ములుగు నుండి కొత్తగూడ అడవులలోకీ ప్రవేశించిన పెద్దపులి. దట్టమైన అడవులలోకీ వెళ్ళొద్దని పశువులకిపరులకు, రైతులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

సాయంత్రం ఆరు గంటలవరకే ఇళ్ళు చేరుకోవాలనీ అధికారుల సూచన చేశారు. పెద్దపులి సంచారం నిజమేనని అటవీ శాఖ అధికారులు   నిర్ధారించారు. దీంతోపాటు కొత్తగూడ, గంగారం మండలాల అడవులలోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. పులి కనిపిస్తే హాని తలపెట్టొద్దని చెప్పారు. 

పెద్దపులి రాకను అడవికి రక్షణ గా భావిస్తున్నామని అటవిశాఖ తెలిపింది. ములుగు జిల్లా జగ్గన్నగూడెం నుండీ మహబూబబాద్ జిల్లా కొత్తగూడ అడవులలోకీ పెద్దపులి ప్రవేశించింది. కొత్తగూడ మండలం ఓటాయి శివారు అడవి ప్రాంతంలో గ్రామస్తులు గుర్తించిన పాద ముద్ర లు పెద్ద పులివే అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.

 అటువైపు వెళ్లొద్దని, పులి కనిపిస్తే హాని తలపెట్టొద్దని అటవి శాఖాధికారులు  కోరుతున్నారు. రెండు పశువులను పెద్ద పులి తినడంతో పాటుగా, రెండు గేదెలను గాయపరచడంతో  విషయం వెలుగు చూసింది. ఈ మేరకు అటవీశాఖ బీట్‌ ఆఫీసర్‌, సెక్షన్‌ ఆఫీసర్లు, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ఓటాయి అడవి లోకి కాలినడక మార్గం ద్వారా చేరుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న పాద ముద్రలను పరిశీలించారు. అక్కడ ఉన్న పాదముద్రలు 14 సెంటీమీటర్లు ఉండడంతో అవి పెద్ద పులివే అని నిర్ధారించారు. కాగా ఇది ములుగు నుండీ వచ్చిన పులేనా? లేక, మరో పెద్దపులి సంచరిస్తుందా అనేది తేలాల్సి ఉంది.

click me!