తెలంగాణ నేతలతో వరుస భేటీలకు షర్మిల ప్లాన్

By narsimha lodeFirst Published Feb 9, 2021, 3:21 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించాలని షర్మిల నిర్ణయం తీసుకొన్నారు. హైద్రాబాద్‌లో కాకుండా అవసరమైతే జిల్లాల్లోనే సమావేశాలు నిర్వహించాలని ఆమె భావిస్తున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించాలని షర్మిల నిర్ణయం తీసుకొన్నారు. హైద్రాబాద్‌లో కాకుండా అవసరమైతే జిల్లాల్లోనే సమావేశాలు నిర్వహించాలని ఆమె భావిస్తున్నారు. 

మంగళవారం నాడు హైద్రాబాద్‌లోని లోటస్‌పాండ్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమయ్యారు. షర్మిలతో ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించి జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లా నేతలకు కూడా సమాచారం వెళ్లింది. 

also read:వైసీపీకి తోకపార్టీ కాదు, అవసరమైతే ఏపీతో తలపడతాం: రాఘవరెడ్డి

 ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది. రోజు విడిచి రోజు ఈ భేటీలు నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణలో రాజకీయంగా ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, ఏ అంశాలను ఎజెండాగా తీసుకోవాలనే విషయంలో ఆమె అభిప్రాయ సేకరణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

 అయితే రాజకీయ పార్టీని స్థాపించే విషయమై షర్మిల ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారితో ఇప్పటికే తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.  సమావేశంలో ఆమె తన మనోగతాన్ని వెల్లడించాకే రాజకీయంగా ఆమె ఎలాంటి అడుగులు వేస్తారన్నది తేలుతుందని అంటున్నాయి.

 ఇదిలా ఉండగా షర్మిల భర్త, బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ఇటీవల తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ‘అదే చోట, అదే పార్టీలో ఉండకుండా సొంత ప్రయత్నం చేస్తాను’ అంటూ ఆంగ్లంలో ఒక పోస్ట్‌ పెట్టడం తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
 

click me!