వైఎస్ షర్మిలకు కేసిఆర్ ప్రభుత్వం షాక్: భద్రత ఉపసంహరణ?

By telugu teamFirst Published Apr 28, 2021, 7:31 AM IST
Highlights

వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో షర్మిల భద్రతను వెనక్కి తీసుకోవడం గమనార్హం.

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టబోతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. షర్మిలకు కల్పించిన భద్రతను తెలంగాణ ప్రభుత్వ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే కేటాయించిన భద్రతను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. 

షర్మిలకు 15 రోజుల క్రితం 2 ప్లస్ 2 గన్ మెన్ ను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం షర్మిలకు కేటాయించిన ఆ భద్రతను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ చేస్తూ షర్మిల దీక్ష చేసిన విషయం తెలిసిందే. 

ఆ దీక్ష చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కల్పించిన భద్రతను వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టేందుకు షర్మిల జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానని ఆమె చెబుతున్నారు. 

click me!