శవాల తరలింపునకు గుర్రాలు వాడండి, లిక్కర్ షాపుల వద్ద చూడండి: తెలంగాణ హైకోర్టు

By telugu team  |  First Published Apr 27, 2021, 6:23 PM IST

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాస్క్ లు పెట్టుకోనివారికి వేయి రూపాయల చొప్పున జరిమానా విధించాలని హైకోర్టు ఆదేశించింది.


హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ వ్యాధితో మరణించినవారి శవాలను తరలించడానికి గుర్రాలను వాడాలని ఆదేశించింది. మాస్క్ ధరించకపోతే వేయి రూపాయల చొప్పున జరిమానా విధించాలని కూడా సూచించింది. 

కరోవా కట్టడికి తాము తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాత్రి కర్ఫ్యూ విధించడమే కాకుండా సోషల్ గ్యాదరింగ్స్ లో వ్యక్తులు గుమికూడడాన్ని 50 శాతం తగ్గించాలని ఆదోసించింది. 

Latest Videos

undefined

Also Read: కరోనా నివేదికపై అసంతృప్తి... కేసీఆర్ సర్కార్ పై హైకోర్టు సీరియస్

ప్రజలు ఎలా గుమికూడుతున్నారో లిక్కర్ షాపుల వద్ద చూడాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్ లు దోపిడీని అరికట్టాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి ఎంతగా ఉందో 108, 104 నెంబర్లకు వస్తున్న కాల్స్ ను చూస్తే అర్థమవుతుందని చెప్పింది. తెలంగాణలో మరిన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 

తెలంగాణకు సరపడినంత ఆక్సిజన్ సరఫరా చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించాలని సూచించింది. ప్రైవేట్ అస్పత్రులన్నీ రిపోర్టులు కూడా చూడకుండా వైద్యం అందించాలని సూచించింది. వృద్ధులకు, దివ్యాంగులకు చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. విచారణను వారం పాటు వాదియా వేసింది. 

Also Read: ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ రూ.500 మాత్రమే.. ఎక్కువ తీసుకుంటే చర్యలు తప్పవు: ఈటల హెచ్చరిక

సామాజిక దూరం పాటించకుండా కరోనా నిబంధనలను పాటించనివారిపై కేసులు పెట్టడం లేదని హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ తగిన ప్రణాళికను అమలు చేయడం లేదని తప్పు పట్టింది. సోషల్ డిస్టెన్స్ మీద నాలుగు కేసులు, పెద్ద యెత్తున గుమికూడడంపై రెండు కేసులు మాత్రమే నమోదు చేయడం పట్ల హైకోర్టు పోలీసులను తప్పు పట్టింది. 

click me!