
ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ మీద వైఎస్ షర్మిల సెటైర్లు వేస్తున్నారు. కోవిడ్ టైంలో ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె ఎత్తు చూపిస్తున్నారు. తెలంగాణలో వెంటనే 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఉద్యోగ దీక్షకు దిగిన షర్మిల.. తన అనుచరులు కోవిద్ బారిన పడడంతో ప్రజా సమస్యలపై పోరుకు కాస్త గ్యాప్ ఇచ్చారు.
అయితే తెలంగాణ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధించేందుకు మాత్రం ట్విట్టర్ను వేదికగా ఎంచుకున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు. రోజురోజుకు తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
‘దొర కెసిఆర్ కు పట్టింపులేదు. సిబ్బంది కొరతతో వైద్యారోగ్యశాఖ ఇబ్బంది పడుతుంటే సార్ కు కనబడడం లేదు...’ అంటూ తెలంగాణ యాసలో ట్వీట్ చేశారు. ‘హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న 23512 ఖాళీ పోస్టులను నింపు జరా.. ’ అంటూ నిరుద్యోగానికి షర్మిల లింకు పెట్టారు.
అవి నింపితే ప్రజల ప్రాణాలతోపాటు నిరుద్యోగులు సైతం ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారంటూ కేసీఆర్ కు షర్మిల ట్వీట్ చేశారు.