చేవేళ్ల నుండి పాదయాత్ర: తేల్చేసిన షర్మిల

Published : Jul 16, 2021, 01:08 PM ISTUpdated : Jul 16, 2021, 02:09 PM IST
చేవేళ్ల నుండి పాదయాత్ర: తేల్చేసిన షర్మిల

సారాంశం

వైఎస్ఆర్ ప్రారంభించినట్టుగానే చేవేళ్ల నుండే తాను కూడ పాదయాత్రను ప్రారంభిస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ యాత్ర చేస్తానని ఆమె చెప్పారు  


హైదరాబాద్: చేవేళ్ల నుండే తాను పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ లో ఆమె శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ చేవేళ్ల నుండి పాదయాత్రను ప్రారంభించారని అక్కడి నుండే తాను కూడ పాదయాత్రను ప్రారంభిస్తానని ఆమె స్పష్టం చేశారు.

also read:తెలంగాణ వద్దని చెప్పలేదు: వైఎస్ షర్మిల

కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే తాను  పాదయాత్రలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్  అమలు చేయలేదన్నారు. వీటిని అమలు చేయాలని ఒత్తిడి తెచ్చేందుకు ఈ  యాత్ర చేస్తామన్నారు.తనకు జంపింగ్ జపాంగ్ లు అవసరం లేదన్నారు. నిఖార్సయిన నాయకులు అవసరం ఉందని చెప్పారు.  

ఆస్తులను కాపాడుకొనేందుకు రాజకీయాల్లోకి వచ్చేవారకు తనకు అవసరం లేదన్నారు.  ప్రజల కోసం  పనిచేసే  నాయకులే అవసరమన్నారు. ప్రజలకోసం పనిచేసే నేతలు తమ పార్టీకి అవసరమన్నారు. తనతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న నేతల గురించి ఆమె ఈ సందర్భంగా వివరించారు. నిస్వార్ధంగా  ప్రజల కోసం వారంతా పనిచేస్తున్న విషయాన్ని ఆమె చెప్పారు 


 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ