YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నా విషయం తెలిసిందే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకరావాలని తీవ్రంగా చర్చిస్తోంది. ఈ క్రమంలో పలువురితో భేటీ అయి.. చర్చిస్తున్నారు.
తాజాగా.. సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌ను కలవడం ఇదే మొదటిసారి.
ఇరువురి మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ విషయాన్ని షర్మిల తన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇదిలాఉండగా.. గతంలో తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి అప్పగించింది.
ఆనాటి నుంచి ప్రత్యార్థులపై విమర్శస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దూకుడుగా వ్యవహరిస్తున్నా షర్మిల ఈ సారి ఏపీ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే.