ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదు:మహబూబ్‌నగర్‌‌కు చెందిన వైఎస్ అభిమానులతో షర్మిల భేటీ

By narsimha lodeFirst Published Mar 2, 2021, 1:25 PM IST
Highlights

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే పాలమూరు జిల్లాలో 80 శాతం పూర్తైన ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
 


హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే పాలమూరు జిల్లాలో 80 శాతం పూర్తైన ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

మంగళవారం నాడు హైద్రాబాద్ లోటస్ పాండ్ లో షర్మిల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేతలతో సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి హాజరైన వైఎస్ఆర్ అభిమానులతో ఆమె జిల్లాలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై  ఆమె చర్చించారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  మహబూబ్ నగర్ జిల్లాలో చేసిన అభివృద్ది గురించి ఆ జిల్లా నేతలు షర్మిలకు వివరించారు.ఈ సందర్భంగా ఆమె వైఎస్ అభిమానులతో మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు లక్షల మంది ఆరోగ్య శ్రీ లబ్దిదారులున్నారన్నారు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జిల్లాలోని 80 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని ఆమె గుర్తు చేశారు.భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్
 ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.పాలమూరు నేడు వలసల జిల్లాగా మారిందని ఆమె విమర్శించారు.

ఇంకా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన నేతలతో కూడ ఆమె సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నెల 9వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించాలని ఆమె భావిస్తున్నారు. ఆ రోజున ఖమ్మం టూర్ వాయిదా పడితే అదే రోజున ఆదిలాబాద్ లేదా వరంగల్ జిల్లా నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.


 

click me!