కత్తులతో బెదిరించి... గోదావరిఖనిలో యువతిపై అత్యాచారయత్నం

Published : Mar 02, 2021, 10:00 AM IST
కత్తులతో బెదిరించి... గోదావరిఖనిలో యువతిపై అత్యాచారయత్నం

సారాంశం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కొందరు కామాంధులు కత్తులతో బెదిరించి ఓ యువతిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. 

పెద్దపల్లి: ఒంటరిగా వెళుతున్న యువతిని వెంబడించి కత్తులతో బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. కామాంధుల నుండి యువతిని కాపాడిన స్థానికులు దేహశుద్ది చేశారు. 

వివరాల్లోకి వెళితే... గోదావరి ఖని ఇంక్లైన్ గడ్డ వద్ద ఓ యువతి ఒంటరిగా వుండటాన్ని కొందరు ఆకతాయిలు గుర్తించారు. దీంతో కత్తులతో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ ఘటనతో బెదిరిపోయిన యువతి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. యువతిపై అఘాయిత్యానికి ప్రయత్నించిన యువకులను పట్టుకుని దేహశుద్ది చేశారు.  స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసే భూమాఫియా నడిపిస్తున్నారు..: కల్వకుంట్ల కవిత
Metro: మెట్రోలో టాయిలెట్ వాడితే డ‌బ్బులు ఇస్తున్నారా.? అస‌లు రూల్స్ ఏం చెప్తున్నాయంటే