కరీంనగర్ రైస్ బౌల్ అనడానికి వైఎస్సే కారణం : షర్మిల

Published : Mar 18, 2021, 04:56 PM IST
కరీంనగర్ రైస్ బౌల్ అనడానికి వైఎస్సే కారణం : షర్మిల

సారాంశం

కరీంనగర్ జిల్లా వైఎస్ అభిమానులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరీంనగర్ తో వైఎస్ కు విడదీయరాని బంధం ఉందన్నారు. కరీంనగర్ కమాన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తుందన్నారు. 

సిటీ ఆఫ్ ఎనర్జీ రామగుండం, సింగరేణి మనకు తలమానికం అన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన నేతన్నలు కనిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. కరీంనగర్ రైతుల కష్టాలు చూసే ఉచిత విద్యుత్ ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ అనడానికి వైఎస్సే కారణమని చెప్పారు. 

ఎల్లంపల్లి, మిడ్ మానేరు కట్టించిన ఘనత వైఎస్ దన్నారు. వాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. 
 
PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?