అసెంబ్లీలోనే... ఆ ఎమ్మెల్యేను దగ్గరకు పిలుచుకుని ప్రశంసించిన కేసీఆర్

By Arun Kumar PFirst Published Mar 18, 2021, 4:41 PM IST
Highlights

కొండగట్టు దేవాలయ ప్రాంగణంలో రామకోటి స్థూప నిర్మాణం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితక్క, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నేతృత్వంలో చేపట్టడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

కొండగట్టులో రామకోటి స్థూప నిర్మాణం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణం భేష్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అసెంబ్లీలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ని ప్రత్యేకంగా పిలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. ఇటీవల కొండగట్టు దేవాలయ ప్రాంగణంలో రామకోటి స్థూప నిర్మాణం, అఖండ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితక్క, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నేతృత్వంలో చేపట్టడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో కేసీఆర్ మాట్లాడుతూ... రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్వాములకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 

పుణ్య స్నానాల కోసం నూతనంగా నిర్మించిన పుష్కర ఘాట్ ను వినియోగిస్తామని ముఖ్యమంత్రికి రవిశంకర్ తెలిపారు. మిషన్ భగీరథ ట్యాంక్ ల నిర్మాణం కూడా పూర్తి అయ్యిందని... వాటిని వినియోగించి తాగునీటికి ఇబ్బంది లేకుండా భక్తులకు అందుబాటులోకి తెస్తామని రవిశంకర్ వివరించారు.


 

click me!