సిట్ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. తనను తాను రక్షించుకొనే ప్రయత్నం చేసినట్టుగా షర్మిల పేర్కొన్నారు.
హైదరాబాద్: తన రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం తన బాధ్యతని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల చెప్పారు. సోమవారంనాడు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. పోలీసులను షర్మిల నెట్టివేశారు. ఈ విషయమై షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయమై షర్మిల మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తాను క్రిమినల్ నా, హంతకురాలినా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తాను ధర్నాకు వెళ్లలేదు,. ముట్టడికి పిలుపుఇవ్వలేదని ఆమెవివరణ ఇచ్చారు. తనకు వ్యక్తిగత స్వేచ్ఛలేదా అని ఆమె అడిగారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.
also read:ఎక్కడపడితే అక్కడ పట్టుకున్నారు, ప్రశ్నిస్తే అరెస్టులా: షర్మిల అరెస్ట్ పై వైఎస్ విజయమ్మ
undefined
టీఎస్‌పీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంపై పోరాటం చేయాలని వైఎస్ఆర్‌టీపీ భావిస్తుంది. ఈ విషయమై అన్నివిపక్ష పార్టీలతో కలిసి ఉద్యమం చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ విషయమై అన్ని పార్టీలకు వైఎస్ షర్మిల లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే.
పోలీస్ స్టేషన్ కు అనిల్ కుమార్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ షర్మిలను ఆమె భర్త అనిల్ కుమార్ పరామర్శించారు. సిట్ కార్యాలయానికి వెళ్లే సమయంలో జరిగిన ఘటనల గురించి షర్మిల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు షర్మిలను తరలించే సమయంలో అనిల్ కుమార్ కూడా ఆమె వెంటే ఉన్నారు.