కల్వకుర్తి కింద కొత్త ఆయకట్టును పెంచలేదు : కేఆర్‌ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ

Siva Kodati |  
Published : Dec 19, 2021, 05:39 PM IST
కల్వకుర్తి కింద కొత్త ఆయకట్టును పెంచలేదు : కేఆర్‌ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ

సారాంశం

కల్వకుర్తి ఆయకట్టు (kalwakurthy lift irrigation) విషయంలో కొత్తగా ఆయకట్టు పెంచలేదని తెలంగాణ ప్రభుత్వం (telangana govt) స్పష్టం చేసింది. ఆయకట్టు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను.. జతచేస్తూ.. కేఆర్ఎంబీకి (krmb) ఈఎన్సీ మురళిధర్  ఆదివారం లేఖ రాశారు.

కల్వకుర్తి ఆయకట్టు (kalwakurthy lift irrigation) విషయంలో కొత్తగా ఆయకట్టు పెంచలేదని తెలంగాణ ప్రభుత్వం (telangana govt) స్పష్టం చేసింది. ఆయకట్టు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను.. జతచేస్తూ.. కేఆర్ఎంబీకి (krmb) ఈఎన్సీ మురళిధర్  ఆదివారం లేఖ రాశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప‌థ‌కాన్ని రెండు కాంపోనెంట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌లో పొందుప‌రచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. రెండు అంశాల‌ను ఒకటిగా పొందుప‌ర‌చాల‌ని ఆయన లేఖలో పేర్కొన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో (united andhra pradesh) కల్వకుర్తి ఆయకట్టును 2.5 లక్షల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచినా.. నీటి కేటాయింపులు పెంచలేదని కేఆర్ఎంబీకి తెలంగాణ చెప్పింది. అయితే కొత్త ఆయకట్టును పెంచలేదని.. పెరిగిన.. ఆయకట్టుకు సరిపడేలా మాత్రమే.. నీటి కేటాయింపులు చేసినట్టు ఈఎన్‌సీ చెప్పారు.

Also Read:సాగర్, శ్రీశైలంలలో తక్షణం విద్యుత్ ఉత్పత్తి ఆపేయండి : ఏపీ, తెలంగాణలకు కేఆర్ఎంబీ ఆదేశం

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం శ్రీశైలం రిజర్వాయర్ (srisailam reservoir) నుంచి +800 అడుగుల వద్ద నీటిని తీసుకునే విధంగా 2006లోనే బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట నివేదించిన డీపీఆర్‌లోనే ఉందని తెలంగాణ ప్రభుత్వం లేఖలో ప్రస్తవించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులైన జీఎన్ఎస్ఎస్, వెలిగొండ‌, హెచ్ఎన్ఎస్ఎస్, టీజీపీ ప్రాజెక్టు రిపోర్టులను కూడా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (brijesh kumar tribunal ) ఎదుట నివేదిస్తూ నాటి ప్రభుత్వం ఫుల్ రిజర్వాయర్ లెవల్ +885 అడుగుల వద్ద నీటిని తీసుకునేవిధంగా డిజైన్ చేసినట్టు తెలిపారని లేఖలో పేర్కొన్నారు.

కల్వకుర్తి ఎత్తిపోత‌ల కృష్ణా నది బేసిన్లోని ప్రాజెక్టు కాబట్టే 800 అడుగుల వద్ద నీరు తీసుకునే విధంగా డిజైన్ చేసినట్టు ఈఎన్సీ లేఖలో చెప్పారు. బేసిన్ అవతలివి కాబట్టి.. ఆంధ్ర ప్రాజెక్టులను పూర్తి రిజర్వాయర్ మట్టం 885 అడుగుల వద్ద తీసుకునే విధంగా డిజైన్ చేశారని పేర్కొన్నారు. ఇలాంటి కారణాల దృష్ట్యా తెలంగాణ ప్రాజెక్టులకు జరిగిన అన్యాయాలను సవరించడానికి చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీ  లేఖలో కోరారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్