అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఉత్సాహం వైఎస్ :అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై కీలక వాదనలు

By narsimha lodeFirst Published May 26, 2023, 2:52 PM IST
Highlights

వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై  తెలంగాణ హైకోర్టులో  ఇవాళ కీలక వాదనలు  జరిగాయి.   వైఎస్ వివేకా హత్య తర్వాత  చోటు  చేసుకున్న పరిణామాలను   అవినాష్ రెడ్డి  తరపు న్యాయవాది ప్రస్తావించారు.

హైదరాబాద్:దస్తగిరి తీసుకున్న  కోటి  రూపాయాల్లో  రూ. 46.70 లక్షలు   రికవరీ చేసినట్టుగా  సీబీఐ  తెలిపిందని  వైఎస్ అవినాష్ రెడ్డి న్యాయవాది  కోర్టుకు తెలిపారు.  మిగిలిన   సొమ్ము ఏమైందో   సీబీఐ  చెప్పడం లేదన్నారు.కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ పై  శుక్రవారం నాడు  వాదనలు  ప్రారంభమయ్యాయి. తాజా పరిణామాలతో  అనుబంధ  కౌంటర్  పిటిషన్ ను సీబీఐ దాఖలు  చేసింది.  మందస్తు బెయిల్ పిటిషన్ పై  వైఎస్ అవినాష్ రెడ్డి  తరపు న్యాయవాది వాదనలు  విన్పించారు.  ఎఫ్ఐఆర్  దర్యాప్తు, కోర్టుల్లో  జరిగిన పరిణామాలపై  అవినాష్ రెడ్డి   తరపు న్యాయవాది వాదనలు విన్పించారు.  

గుండెపోటు  అన్నంత  మాత్రాన  నేరం  చేసినట్టుగా  చెప్పడం సరికాదన్నారు.  అవినాష్ రెడ్డి వైద్యుడో, పోలీస్ అధికారో  కాదు  కదా అని వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది  చెప్పారు.  ఏ1 గంగిరెడ్డికి  వివేకాకు  భూ వివాదాలున్నాయన్నారు.  సునీల్ , ఉమాశంక్   కు వివేకాతో  వజ్రాల వ్యాపారంలో విబేధాలున్న విషయాన్ని ఆయన గుర్తు  చేశారువివేకానంద రెడ్డి  దస్తగిరిని  డ్రైవర్ గా  తొలగించి   ప్రసాద్ ను  పెట్టుకున్నారని  ఆయన  ఈ సందర్భంగా  కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.   ఎబ్మెల్సీ  ఎన్నికల్లో  ఓటమికి అవినాష్ రెడ్డి  కారణమని  వివేకానందరెడ్డి  భావించారన్నారు. . వివేకానందరెడ్డి ఓటమికి కారణాలను సాక్షులే వివరించారన్నారు.  

స్థానిక నేతలు సహకరించకపోవడం వల్లే  వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓడిపోయారని  సాక్షులు  ప్రకటించిన విషయాన్ని  న్యాయవాది గుర్తు చేశారు.  ఎఫ్ఐఆర్ లో  సీబీఐ   ఐపీసీ 302  సెక్షన్ కింద కేసు నమోదు చేసిందని,  కానీ సెక్షన్  201  ప్రకారం  నమోదు  చేయలేదన్నారు.  . అప్పటికే  ఉన్న ఎఫ్ఐఆర్ ను యథాతథంగా  అమలు  చేస్తారా అని  వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది  ప్రశ్నించారు. హత్య  చేసిన దస్తగిరిని  సీబీఐ  వెనకేసుకు వస్తుందని  అవినాష్ రెడ్డి  న్యాయవాది  కోర్టుకు  చెప్పారు. 
 దస్తగిరి  ముందస్తు బెయిల్ ను  సీబీఐ వ్యతిరేకించలేదన్నారు. గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పై  సీబీఐ అభ్యంతరం తెలిపిన విషయాన్ని  అవినాష్ రెడ్డి న్యాయవాది  ఈ సందర్భంగా  ప్రస్తావించారు. 

also read:ఎర్ర గంగిరెడ్డికి షాక్: బెయిల్ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
దస్తగిరి బయల తిరుగతుంటే  వైఎస్   సునీతా రెడ్డి  స్పందించడం లేదన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్  చేసేందుకు సీబీఐ ఉత్సాహం  చూపుతుందని  ఆయన  ఈ సందర్భంగా  పేర్కొన్నారు. కీలక  సాక్షి  రంగయ్య  స్టేట్ మెంట్  రికార్డు  చేశారా అని  సీబీఐని హైకోర్టు  ప్రశ్నించింది. అయితే  గతంలోనే  రంగయ్య  స్టేట్ మెంట్ రికార్డు  చేశామని  సీబీఐ  తరపు న్యాయవాది  కోర్టుకు  తెలిపారు. 

ఇవాళ మధ్యాహ్నం  లంచ్ బ్రేక్ వరకు  అవినాష్ రెడ్డి తరపు   న్యాయవాది  వాదించారు. అయితే  వాదనల్లో వేగం పెంచాలని  కోర్టు  అవినాష్ రెడ్డి  న్యాయవాదికి సూచించింది. మరో వైపు   మధ్యాహ్న భోజనం సమయం కావడంతో  వాదనలకు బ్రేక్ పడింది. లంచ్ బ్రేక్ తర్వాత  విచారణ తిరిగి  ప్రారంభం కానుంది. 

click me!