నిండా 20ఏళ్లు లేవు.. ఒకేసారి ముగ్గురిని ప్రేమ పేరిట ట్రాప్ చేసి...

Published : Aug 05, 2021, 08:33 AM ISTUpdated : Aug 05, 2021, 08:38 AM IST
నిండా 20ఏళ్లు లేవు.. ఒకేసారి ముగ్గురిని ప్రేమ పేరిట ట్రాప్ చేసి...

సారాంశం

ఇది ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను వదిలేశాడు. ఆ తర్వాత మరో బాలిక(14) తో శారీరక సంబంధం పెట్టుకున్నాడు..

వాడికి కనీసం నిండా 20ఏళ్లు కూడా లేవు. సరిగ్గా చెప్పాలంటే వాడి వయసు 17. ఈ వయసులోనే ఒకరికి తెలీకుండా మరొకరిని.. ఏకంగా ముగ్గురు బాలికలను ప్రేమ పేరిట ట్రాప్ చేశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు మొదట పక్క గ్రామానికి చెందిన బాలిక(16) ను ప్రేమ పేరిట వంచించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇది ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను వదిలేశాడు. ఆ తర్వాత మరో బాలిక(14) తో శారీరక సంబంధం పెట్టుకున్నాడు..

ఈ బాలికకు తెలీకుండా మరో బాలికను పెళ్లి చేసుకుంటానంటూ దగ్గరయ్యాడు. అనుమానంతో మూడో బాలిక ఇంటికి వచ్చేసరికి.. ఆ బాలుడి అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మూడో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురినీ మోసం చేశాడని బాలుడిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!