భర్తతో గొడవ.. మూఢ నమ్మకాలు మనసులో పెట్టుకొని...!

Published : Aug 05, 2021, 07:31 AM IST
భర్తతో గొడవ.. మూఢ నమ్మకాలు మనసులో పెట్టుకొని...!

సారాంశం

దేవుడికి హారతి ఇస్తుంటే.. అది ఆరిపోయింది..  అనంతరం బొట్టు పెట్టుకుంటుంటే.. కుంకుమ భరణి చేయ్యి జారి కింద పడింది.

ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్తతోనే చివరిదాకా జీవించాలని అనుకుంది. అయితే.. ఇటీవల ఓ చిన్న విషయంలో భర్తతో గొడవ జరిగింది. దీంతో.. చాలా మనస్థాపానికి గురైంది. ఆ తర్వాత దేవుడికి హారతి ఇస్తుంటే.. అది ఆరిపోయింది..  అనంతరం బొట్టు పెట్టుకుంటుంటే.. కుంకుమ భరణి చేయ్యి జారి కింద పడింది. అంతే.. ఇవన్నీ అపశకునాలుగా భావించింది. ఆ మూఢ నమ్మకాలను నమ్మి.. ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జార్ ఖండ్ ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్, కవిత(23) లు ఆరేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 78 సమీపంలోని అంబేడ్కర్ నగర్ లో ఓ ఇంటి మూడో అంతస్తులో నివసిస్తున్నారు. వీరికి కుమార్తె శివాని(4) కూడా ఉంది. 

కాపలాదారుడిగా పనిచేసే ఓం ప్రకాశ్ మంగళవారం తన కుమార్తెను తీసుకొని పనికి వెళ్లాడు. రాత్రి 7.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు ఎన్నిసార్లు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూశాడు. కవిత ఫ్యాన్ కి ఉరివేసుకొని కనిపించింది. దీంతో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లి చూశాడు. 

ఆ తర్వాత ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియో చూడటంతో... చిన్న విషయానికే ఆమె మనస్థాపానికి గురై.. బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !
Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?