ట్రిపుల్ రైడింగ్.. అడ్డుకోబోయిన హోంగార్డును బై‌క్‌తో ఢీకొట్టిన యువకులు

Published : Mar 27, 2022, 03:19 PM IST
ట్రిపుల్ రైడింగ్.. అడ్డుకోబోయిన హోంగార్డును బై‌క్‌తో ఢీకొట్టిన యువకులు

సారాంశం

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌పై అతివేగంతో వెళ్తున్న యువకులు హోంగార్డ్‌ను ఢీకొట్టారు. దీంతో ఆ హోంగార్డుకు గాయాలు అయ్యాయి. 

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బైక్‌పై అతివేగంతో వెళ్తున్న యువకులు హోంగార్డ్‌ను ఢీకొట్టారు. దీంతో ఆ హోంగార్డుకు గాయాలు అయ్యాయి. మరోవైపు హోం గార్డును బైక్‌తో ఢీకొట్టిన యువకులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు..  జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ బైక్‌పై ముగ్గురు యువకులు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అటుగా వచ్చారు. బైక్‌పై వేగంగా వెళ్తున్నవారిని అక్కడున్న హోం గార్డు ఆపేందుకు యత్నించాడు. 

అయితే బైక్‌ నడుపుతున్న యువకుడు.. తప్పించుకునే క్రమంలోనే హోంగార్డును ఢీకొట్టాడు. ఈ ఘటనలో హోంగార్డుకు గాయాలు అయ్యాయి. దీంతో అతడిని ఆటోలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హోంగార్డును ఢీకొట్టిన యువకులను స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.  

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు