మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి.. కరెంట్ షాక్ తో యువకుడు మృతి...

Published : Jul 10, 2023, 11:33 AM ISTUpdated : Jul 10, 2023, 11:53 AM IST
మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి.. కరెంట్ షాక్ తో యువకుడు మృతి...

సారాంశం

సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లో విషాద ఘటన వెలుగు చూసింది. కరెంట్ షాక్ తో ఓ యువకుడు మృతి చెందాడు. 

సికింద్రాబాద్ : లష్కర్ బోనాల్లో అపశృతి చోటు చేసుకుంది. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఆకాష్ సింగ్ అనే యువకుడు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. ఆకాష్ సింగ్ బేంగం బజార్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. 

బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి గుడి దగ్గరికి వచ్చాడు. కరెంట్ స్తంభం షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్నటి వర్షాలకు కరెంట్ స్తంభం షాక్ వస్తున్నట్లుగా గుర్తించారు. అయితే, ఈ ఘటన మీద ఇప్పటివరకు విద్యుత్ శాఖ అధికారులు ఏమీ స్పందించలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: పసిఫిక్ నుంచి అరేబియా దాకా సముద్రంలో తుపాన్లు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి | Smart Ration Cards Launch