హైదరాబాద్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం.. పోలీసు వాహనం పైకెక్కి రచ్చ..

Published : Jun 14, 2022, 10:56 AM IST
హైదరాబాద్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం.. పోలీసు వాహనం పైకెక్కి రచ్చ..

సారాంశం

హైదరాబాద్‌లోని ఆసిఫ్నగర్లో గత అర్థరాత్రి కొందరు యువకులు హల్‌చల్ చేశారు. గంజాయి మత్తులో సృష్టించారు. జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర యువకులు గంజాయి మత్తులో నానా హంగామా చేశారు. 

హైదరాబాద్‌లోని ఆసిఫ్నగర్లో గత అర్థరాత్రి కొందరు యువకులు హల్‌చల్ చేశారు. గంజాయి మత్తులో సృష్టించారు. జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర యువకులు గంజాయి మత్తులో నానా హంగామా చేశారు. వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. ఇందుకు సంబంధించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. యవకులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. 

అయితే గంజాయి మత్తులో ఉన్న యువకులు పోలీసు వాహనం ఎక్కి నానా రచ్చ చేశారు. పోలీసు వాహనంతో పాటు అక్కడ ఉన్న పలు వాహనాల అద్దాలను పగలగొట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొనేందుక కఠినంగా వ్యవహరించారు. యువకులపై లాఠీ‌లతో దాడి చేసి.. అదుపులోకి తీసుకున్నారు. యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వారికి గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు