చమురు ధరల పెంపును నిరసిస్తూ గాంధీభవన్ వద్ద యూత్ కాంగ్రెస్ ధర్నా: ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Jun 8, 2021, 1:23 PM IST
Highlights

పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ తో గాంధీ భవన్ వద్ద యూత్ కాంగ్రెస్  నేతలు ఆందోళనకు దిగారు. గాంధీ భవన్  వద్ద నుండి ఆందోళనకారులు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
 

హైదరాబాద్: పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ తో గాంధీ భవన్ వద్ద యూత్ కాంగ్రెస్  నేతలు ఆందోళనకు దిగారు. గాంధీ భవన్  వద్ద నుండి ఆందోళనకారులు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలని కోరుతూ  యూత్ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ వద్ద  కారుకు తాడు కట్టి నిరసన వ్యక్తం చేశారు.

గాంధీ భవన్ వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు.  బారీకేడ్లు తోసుకొని వచ్చేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొన్నారు. దీంతో  గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో యూత్ కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లు దాటకుండా పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించాలనే డిమాండ్ తో  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు.  పెట్రోల్ ధరలు లీటర్ కు వందరూపాయాలు  దాటాయి. పెట్రోల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. 

click me!