కష్టకాలంలో అండగా ఉన్నా, బ్లాక్‌మెయిల్‌తో కొనలేరు: కేసీఆర్‌పై ఈటల

Published : Jun 08, 2021, 01:14 PM ISTUpdated : Jun 08, 2021, 01:28 PM IST
కష్టకాలంలో అండగా ఉన్నా, బ్లాక్‌మెయిల్‌తో కొనలేరు: కేసీఆర్‌పై ఈటల

సారాంశం

డబ్బులు, దౌర్జన్యంతో కేసీఆర్ గెలవలేరని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.  

కరీంనగర్: డబ్బులు, దౌర్జన్యంతో కేసీఆర్ గెలవలేరని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.మంగళవారం నాడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు.తనకు, టీఆర్ఎస్ కు మధ్య జరుగుతున్న పోరాటాన్ని మహాభారతంతో పోల్చారు. కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధంగా ఆయన అభివర్ణించారు. కొందరు నేతలు కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. వారిని రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమని ఆయన చెప్పారు. కష్టకాలంలో అండగా ఉన్న తనను కేసీఆర్ పక్కన పెట్టారని రాజేందర్ చెప్పారు. 19 ఏళ్లు గులాబీ జెండాను మోసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

also read:నాడు నోటా కంటే తక్కువ ఓట్లు: ఈటల చేరికతో బీజేపీకి హుజూరాబాద్‌లో కలిసొచ్చేనా?

రూ. 100 కోట్లతో బ్లాక్ మెయిల్ చేసినా తనను కొనలేరని ఆయన తేల్చి చెప్పారు.ఉద్యమ కారులెవరో ఉద్యమ ద్రోహులో ప్రజలే తేల్చుకొంటారని ఆయన చెప్పారు.తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువైతే ఆ కరీంనగర్ ను కాపాడుకొంది ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం నేటి హుజూరాబాద్ నియోజకవర్గమేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఆత్మగౌరవానికి ఛాన్స్ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత ఈటల రాజేందర్ తొలిసారిగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇవాళ పర్యటించారు.  త్వరలోనే  ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.  గత వారంలోనే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.  ఈ నెల 11వ తేదీ తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజీేపీలో చేరే అవకాశం ఉంది

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!