సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యలు: మద్దతుగా యూత్ కాంగ్రెస్ ఆందోళన

By narsimha lode  |  First Published Nov 20, 2022, 4:38 PM IST

సావర్కర్  పై  రాహుల్ గాంధీ  వ్యాఖ్యలకు మద్దతుగా  ఆదివారంనాడు  యూత్  కాంగ్రెస్  నేతలు  ఆదివారంనాడు  ఆందోళనకు  దిగారు. 


హైదరాబాద్:సావర్కర్ పై  రాహుల్  గాంధీ  వ్యాఖ్యలకు  మద్దతుగా ఆదివారంనాడు  యూత్  కాంగ్రెస్ నేతలు  గాంధీ భవన్  వద్ద  ఆందోళనకు  దిగారు.  ప్రధాని  మోడీకి  వ్యతిరేకంగా  యూత్  కాంగ్రెస్  శ్రేణులు ఆందోళనకు  దిగాయి.  ఈ  కార్యక్రమంలో  కాంగ్రెస్  పార్టీ   వర్కింగ్  ప్రెసిడెంట్  జగ్డారెడ్డి  పాల్గొన్నారు.ప్రధాని  మోడీ  చిత్రపటంతో   యూత్  కాంగ్రెస్  కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ సమయంలో  పోలీసులు  యూత్  కాంగ్రెస్  కార్యకర్తలను  అడ్డుకున్నారు. పోలీసులతో  కాంగ్రెస్ పార్టీ   వర్కింగ్  ప్రెసిడెంట్  జగ్గారెడ్డి  వాగ్వాదానికి  దిగారు.  

ఈ  సందర్భంగా  ఆయన  ప్రసంగించారు. తమ  నేత  రాహుల్  గాంధీని చంపేస్తామని  లేఖలు  వచ్చాయన్నారు.  మధ్య ప్రదేశ్  లోకి రాహుల్  గాంధీ అడుగుపెడితే  అంతు చూస్తామని వచ్చిన  లేఖను  ఆయన  ప్రస్తావించారు.మా  నాయకుడిని  కాపాడుకునే  శక్తి తమకు  ఉందన్నారు.హింస  దిశగా  దేశాన్ని  పాలిస్తున్న  బీజేపీ సిగ్గుపడాలన్నారు. బీజేపీ  నేతలు  రాహుల్  గాంధీపై  విమర్శలు  చేయడాన్ని ఆయన  తప్పుబట్టారు. 

Latest Videos

ఇదిలా  ఉంటే  తెలంగాణ  కాంగ్రెస్ పార్టీలో ఇటీవల  కాలంలో  చోటు  చేసుకున్న  పరిణామాలపై  కొందరు  సీనియర్లు  అసంతృప్తిని  వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  వ్యవహరశైలిని  సీనియర్లు  తప్పుబడుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  మర్రి శశిధర్ రెడ్డి  కేంద్ర హోంశాఖ  మంత్రి  అమిత్  షాతో  ఢిల్లీలో  భేటీ అయ్యారు.  ఆయన  బీజేపీలో చేరనున్నారు. మర్రి శశిధర్ రెడ్డిపై  కాంగ్రెస్ పార్టీ  ఆరేళ్లపాటు  బహిష్కరించింది.  అయితే  ఈ నిర్ణయాన్ని  పీసీసీ  క్రమశిక్షణ  సంఘంలోని  కొందరు  సభ్యులు  వ్యతిరేకిస్తున్నారు. ఎఐసీసీకి  చెందిన  సభ్యుడిపై  పీసీసీ క్రమశిక్షణ  సంఘం  ఎలా  చర్యలు తీసుకొంటుందని  ప్రశ్నిస్తున్నారు.  బీజేపీలో చేరుతానని  ప్రకటన  చేసినందున  మర్రి  శశిధర్ రెడ్డిపై  చర్య  తీసుకోవడంలో  తప్పేం  లేదని  పీసీసీ  క్రమశిక్షణ సంఘం  చైర్మెన్  డాక్టర్  చిన్నారెడ్డి  స్పష్టం చేశారు.టీపీసీసీ  చీఫ్  రేవంత్  రెడ్డి తీరును  తప్పుబడుతూ  జూమ్  మీటింగ్ ను  ఆ  పార్టీ  వర్కింగ్  ప్రెసిడెంట్  జగ్డారెడ్డి బహిష్కరించారు.

click me!