అత్తాపూర్ లో ఫైనాన్షియర్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య...

హైదరాబాద్ అత్తాపూర్ లో ఫైనాన్షియర్ వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

Google News Follow Us

హైదరాబాద్ : హైదరాబాద్ అత్తాపూర్ సులేమాన్ నగర్ లో దారుణం వెలుగుచూసింది. తౌఫీక్ అనే ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. ఫైనాన్షియర్ వేధింపులతో యువకుడు మృతి చెందాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనికి తోడు యువకుడిని ఇంట్లో నుంచి తీసుకెళ్లి రౌడీషీటర్లతో దాడి చేయించాడు. 

దీంతో వేధింపులు భరించలేక యువకుడు ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Read more Articles on